Venkatesh1

Apr 15 2024, 06:59

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ

◆ దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక, టీడీపీ ఓటమి భయంతో దాడికి పాల్పడటం పిరికిపంద చర్య అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం.శంకర్ నారాయణ విమర్శించారు.

బుక్కరాయసముద్రం మండలం బొమ్మలపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో వీరాంజనేయులు, శంకర్ నారాయణ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో ప్రతిపక్షాలు ఓటమి భయంతో ఈ ఘాతుకానికి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన ఈ దాడి ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రగా భావిస్తున్నామన్నారు. టిడిపి జనసేన ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని, టిడిపిని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 15 2024, 06:47

దేశానికి మార్గదర్శి బీఆర్ అంబేడ్కర్.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు...

దేశానికి మార్గదర్శి బీఆర్ అంబేడ్కర్.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన క్రాంతిమూర్తి, భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 133 వ జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, దళిత నాయకులు, పార్టీ శ్రేణుల తో కలసి ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్న సామాజిక సమానత్వ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించారన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పాలన సాగిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా నియమించి సామాజిక విప్లవానికి నాంది పలికిన ఏకైక సీఎం జగనన్న అని అన్నారు.

Venkatesh1

Apr 14 2024, 07:14

పోతురాజు కాలువ లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిక..

పోతురాజు కాలువ లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిక..

సింగనమల మండలం పోతురాజు కాలువ గ్రామంలో సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణ శ్రీ మరియు ద్వి సభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి నియోజకవర్గ అబ్జర్వర్ గుర్రప్ప నాయుడు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది 

ఈ సందర్భంగా బండారు శ్రావణ శ్రీ గారు మాట్లాడుతూ పార్టీలో మీకు సముచిత న్యాయం చేస్తామని పార్టీ కోసం కష్టపడాలని తెలుగుదేశం పార్టీలోకి చేరిన కార్యకర్తలకు నాయకులకు తెలియజేయడం జరిగింది*

Venkatesh1

Apr 14 2024, 07:07

వైఎస్సార్సీపీ తో ఇంటింటా సంక్షేమాభివృద్ధి.. టీడీపీ హామీలను నమ్మి మోసపోవద్దు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరా

వైఎస్సార్సీపీ తో ఇంటింటా సంక్షేమాభివృద్ధి.. టీడీపీ హామీలను నమ్మి మోసపోవద్దు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరా.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటా సంక్షేమాభివృద్ధి జరిగిందని, ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు కోరారు.

పుట్లూరు మండలం మడ్డిపల్లి, నారాయణరెడ్డిపల్లి, సూరేపల్లి, గొల్లపల్లి, అరకటవేముల, కొండాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి ఆయన గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.

గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జగనన్న చేసిన ఐదేళ్ల పాలనలో అందిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు గుర్తు చేశారు. "ఫ్యాన్ " గుర్తు కు ఓటు వేసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను గెలిపిస్తే మీ అందరి సేవకుడిగా పనిచేస్తూ, అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచారని గుర్తు చేశారు. టీడీపీ వారు నెరవేర్చలేని అబద్ధపు హామీలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. జగనన్న ఐదేళ్లలో చేసిన సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ధైర్యంగా ఫలానా చేసామని చెప్పుకుంటున్నామని, టిడిపి పాలనలో ప్రజలకు చేసిన ఒక్క మేలునైనా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు.  

మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి "ఫ్యాన్" ప్రభంజనం ఖాయమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి జగనన్న పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 14 2024, 06:54

విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి.. దాడిని ఖండించిన శింగనమల వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి.. టీడీపీ పిరికిపంద చర్య..

శింగనమల వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని శింగనమల వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ఖండించారు.

మేమంతా సిద్ధం యాత్రలో జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేని తెలుగుదేశం నాయకులు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

పేదల పక్షాన నిలబడిన మా నాయకుడిపై తెలుగుదేశం పార్టీ పెత్తందారుల దాడిగా అభివర్ణించారు.

జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అందదండలు, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు అయన ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని అన్నారు.

Venkatesh1

Apr 13 2024, 07:45

అమ్మవారిపేట గ్రామంలో గుజ్జల గంగన్న ఇంట్లో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితుడు వివరణ

బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట గ్రామంలో నివాసముంటున్న గుజ్జుల గంగన్న s/o దుర్గప్ప గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి దాదాపుగా రెండు లక్షల పైగా నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నారు తక్షణమే వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు

Venkatesh1

Apr 13 2024, 07:38

వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన NDA కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ,ఆలం నరసానాయుడు..

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నార్పల మండలం దుర్గం గ్రామంలో పర్యటించి బాబు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరిస్తూ గ్రామంలోని సమస్యలు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన NDA కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గారు, దిస్సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు.

 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 13 2024, 07:28

నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ముంటిమడుగు కేశవరెడ్డి గారు, బండారు కిన్నెర శ్రీ..

నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ముంటిమడుగు కేశవరెడ్డి గారు, బండారు కిన్నెర శ్రీ..

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఇబుది జమ్మన్న కు చెందిన చిని, మామిడి, మొక్కజొన్న పంటలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.విషయం తెలుసుకున్న శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటి సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి అన్న గారు బండారు కిన్నెర గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 20000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రైతు 6 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాడు చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతు బోరున విలపించాడు దాదాపు 5 లక్షల వరకు ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. జమ్మన్న ను ప్రభుత్వం ఆదుకోవాలని ముంటిమడుగు కేశవరెడ్డి గారు బండారు కిన్నెర శ్రీ గారు కోరారు.

ఈ కార్యక్రమం లో గార్లదిన్నె మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 13 2024, 07:19

పల్లె నిద్రతో.. పల్లె ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..

పల్లె ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..

ప్రజా సమస్యల పరిస్కారమే లక్హ్యంగా శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు "పల్లె నిద్ర" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా ఆయా గ్రామాల్లో రాత్రి సమయంలో ప్రజలతో మమేకమై గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరాతీసి వాటి పరిస్కారంపై దృష్టి సారించారు. ప్రతి పల్లెలోను వీరాంజనేయులు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

యల్లనూరు మండలంలోని వాసాపురం గ్రామంలో " మన ఊరికి మన వీరా" వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారం అనంతరం ఎస్సీ కాలనీ "పల్లె నిద్ర" కార్యక్రమం చేపట్టారు.

అక్కడ ప్రజలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానికులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో రేషన్, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయ లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను మీ అందరి దీవెనలతో రానున్న ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించిన వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. 

ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Venkatesh1

Apr 13 2024, 07:11

వైఎస్సార్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించాలి..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ..

వైఎస్సార్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని, ప్రతిఒక్కరూ " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయాలని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

యల్లనూరు మండలం కోడుమూర్తి, చిలమకూరు, అచ్యుతాపురం, బొప్పేపల్లి, వాసాపురం, కూచివారిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన నిర్వహించారు.

ఇంటింటికీ తిరుగుతూ జగనన్న చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించి, గడప వద్దకే సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. రానున్న ఎన్నికల్లో " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ కరపత్రాలు అందజేశారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..ప్రతిపక్ష టీడీపీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలను నేరుగా అందించిన ఘనత వైస్సార్సీపీకే దక్కుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి రహితంగా ప్రభుత్వ పథకాలను అందించటం జరిగిందన్నారు. జగనన్న నేతృత్వంలో పారదర్శక పాలనను చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నాడన్నారు.

రాష్ట్రంలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ప్రజలను మోసగించేందుకు వస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని కూటములతో వచ్చినా ప్రజల అండ ఉన్నంతవరకు జగనన్నని ఏమీ చేయలేరన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని రానున్న ఎన్నికలలో జగనన్నకు తమ ఓటు వేస్తామని ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.